calender_icon.png 24 November, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించిన బాన్సువాడ అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర..

24-11-2025 04:23:52 PM

బాన్సువాడ (విజయక్రాంతి): సువర్ణభూమి శబరిమల మహా పాదయాత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర సోమవారానికి కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ప్రవేశించినట్లు అయ్యప్ప స్వాములు చిదుర వంశీ, సిద్ధంశెట్టి శ్రీనివాస్ గుప్తాలు తెలిపారు. గత 21 రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కొనసాగిన అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర కర్ణాటక రాష్ట్రానికి చేరుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. అయ్యప్ప స్వాములు అయ్యా అప్ప అయ్యప్ప అంటూ భక్తిశ్రద్ధలతో, పడిపూజ కార్యక్రమాలతో భజన కార్యక్రమాలతో మహాపాదయాత్రను కొనసాగిస్తున్నారు. గురు వినయ్ గురు స్వామి ఆధ్వర్యంలో ఈ మహా పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని అయ్యప్ప స్వాములు తెలిపారు.