24-11-2025 02:27:02 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాళ్లపల్లి శ్రీనివాస్ వైద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది వైద్యాధికారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఎంబిబిఎస్ చదివి వైద్యాధికారి ఉద్యోగం సాధించి సొంత మండలంలోని ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆనందంగా ఉందని తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు చేసేందుకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మాన్విత, వైద్య సిబ్బంది ఉన్నారు.