24-11-2025 01:47:52 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నాచారం నూతనంగా ప్రభుత్వ మంజూరు చేసిన ఆప్కారి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను సోమవారం నాడు శాసనమండలి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ మహేంద్ర రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రజా ప్రతినిధులు లాంఛనంగా ప్రారంభించారు. 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం నోచుకుంది. రాష్ట్రంలో కొత్తగా 14 ఆప్కారి చేసిన మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత జూన్ 26 తారీఖున ఉత్తర్వులు జారీ చేసింది.
అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో 12 మంజూరు కాగా ఉప్పల్ నియోజకవర్గంలోని రెండు ఆప్కారి పోలీస్ స్టేషన్లను మంజూరు చేయగా సోమవారం రోజున ప్రారంభించారు. ఆప్కారి అధికారులు స్థానిక నాయకులతో ఉప్పల్ ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో మరమ్మతులు చేసి నాచార ఆప్కారి పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఈఎస్ నవీన్ కుమార్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నాచారం ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా ఓంకార్ నూతనంగా ఏర్పాటైన నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా ఓంకార్ బాధ్యతలు చేపట్టారు. ఉప్పల్ తో పాటు నాచారం ఆప్కారీ పోలీస్ స్టేషన్ బాధ్యతలు అదనంగా ఓంకార్ నిర్వహించనున్నారు. నాచారం ఆప్కారి పోలీస్ స్టేషన్ పరిధిలో మీర్పేట్ ఎస్ బి కాలనీ మల్లాపూర్ నాచారం చిలుకానగర్ మీర్పేట్ హబి కాలనీ మల్లాపూర్ నాచారం చిలుకానగర్ హబ్సిగూడ వార్డ్ డివిజన్లో ఉంటాయని అధికారులు తెలిపారు.