24-11-2025 02:16:55 PM
బాలీవుడ్ హీ-మ్యాన్ ఇక లేరు
ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర(Dharmendra Passes Away) కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ధర్మంద్ర నవంబర్ 12న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్(Breach Candy Hospital) నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఇంట్లో బాగా కోలుకుంటున్నారని చెబుతున్నారు. ఆ సమయంలో ఆసుపత్రి నుండి డాక్టర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ, అవసరమైన చికిత్స పొందిన తర్వాత ఆ దిగ్గజ నటుడు పూర్తి సంతృప్తితో ఇంటికి వెళ్ళారని అన్నారు.
ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్ లో జన్మించారు. బాలీవుడ్ హీమ్యాన్(Bollywood He-Man)గా ధర్మేంద్రకు గుర్తింపు లభించింది. షోలే బ్లాక్ బస్టర్ తో ధర్మేంద్రకు స్టార్ డమ్ లభించింది. 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే సినిమాతో ధర్మేంద్ర తెరంగేట్రం చేశారు. 300 కు పైగా సినిమాల్లో ధర్మేంద్ర నటించారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. 2004లో రాజస్థాన్ బికనీర్ నుంచి ధర్మేంద్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2012లో ధర్మేంద్రకు పద్మభూషన్ వరించింది. 1997లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు. ధర్మేంద్ర మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.