calender_icon.png 24 November, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల పథకం... పేదల సొంత గృహ కల్పనే లక్ష్యం

24-11-2025 02:31:54 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

బాన్సువాడ,(విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదల కుటుంబాలకు సొంత గృహకల్పనే లక్ష్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుడు నిర్మించుకుంటున్న ఇంటినిర్మాణానికి  సోమవారం జిల్లా కలెక్టర్  భూమిపూజ  కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి–ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు స్వంత గృహాల కల నెరవేరుతున్నదని తెలిపారు. లబ్ధిదారులందరికీ నాణ్యమైన ఇళ్లు నిర్మించబడేలా అధికారులు పర్యవేక్షణ సాగించాలని ఆదేశించారు. గ్రామంలో సామాజిక వసతుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లబ్దిదారుడు భూమిపూజ అనంతరం పనులు వేగవంతంగా ప్రారంభించి త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, తహసిల్దార్ సువర్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.