calender_icon.png 24 November, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలు వస్తున్నందునే మహిళలకు చీరల పంపిణీ

24-11-2025 02:35:08 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిందని బీజేపీ నాయకురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చీరలు పంపిణీ చేస్తున్నారని, పట్టణ ప్రాంతాలలో ఎన్నికలు లేనందున ఈ ప్రాంతాల్లో మహిళలకు మొండి చేయి చూపుతున్నారు. ప్రస్తుతము ఏ పండుగలు లేవని కేవలం పంచాయతీ ఎన్నికల ఓట్ల కోసం పిల్లలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలలో అనేకం అమలు చేయకుండా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. మహిళల మీద గౌరవం ఉంటే గతంలో హామీ ఇచ్చిన నెలకు రూ.2500 చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. అనేక నెలలుగా గ్యాస్ సబ్సిడీ కూడా రావడం లేదన్నారు. మహిళలను మోసం చేయడం సరికాదన్నారు.