13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

కిటకిటలాడిన మహాశక్తి ఆలయం

28-03-2026 12:00 AM

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం 

పాల్గొన్న కేంద్రమంత్రి బండి సంజయ్ దంపతులు

కరీంనగర్, మార్చి 27 (విజయక్రాంతి): నగరంలోని మహిమాన్విత మహాశక్తి ఆలయం శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా భక్తుల తాకిడితో కిటకిటలాడింది. ఆలయంలో సీతారాముల కళ్యాణం భద్రాద్రి తరహాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్-అపర్ణ దంపతులు, కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు.

వేద మంత్రోచ్చారణాల మధ్య అట్టహాసంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు జరిగాయి. యజ్ఞోపవీతం మొదలు కన్యదానం, జీలకర్ర, బెల్లం, తాళిబొట్టు వరకు సీతమ్మ-రామయ్య పెళ్లి వేడుకలను వేద పండితులు భక్తులకు వివరించారు. రామయ్య పెళ్లి వేడుకలకు వేలాదిగా భక్త జన సందోహం తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు చల్లని మంచి నీళ్లు, మజ్జిగను సరఫరా చేశారు. ఎండ నుండి ఉపశమనం కలిగించేందుకు కూలర్లు ఏర్పాటు చేశారు. 25 వేల మంది భక్తులకు భోజనాలు, ప్రసాదాలు వితరణ చేశారు.