11 May, 2026 | 2:17 AM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి

11-05-2026 01:16 AM

విండో చైర్మన్ సదాశివరెడ్డి

సదాశివనగర్, మే 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం కుప్రియాల్, మర్కల్ గ్రామాల్లో విండో చైర్మన్ మర్రి సదాశివరెడ్డి మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కుప్రియాల్ సర్పంచ్ కొతోల్లా రాజమణి , మర్కల్ సర్పంచ్ కుంట ప్రియాంక , సిడిసి చైర్మన్ ఈర్షద్ , మార్కెట్ కమిటీ చైర్మన్ సంగ్య నాయక్, ఉప సర్పంచులు, సొసైటీ పాలకవర్గం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిరెడ్డి, సీనియర్ నాయకులు లింగా గౌడ్, రైతులు, వార్డు మెంబర్లు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.