26-07-2025 12:28:04 AM
కొండా చరణ్
చర్ల, జూలై 25, (విజయక్రాంతి):సంక్షేమ పథకాలనుఎరవేసి బహుజనుల కు ఎల్లకాలం అధికారానికి దూరం చేయలేరని బహుజన సమాజ్ పార్టీ కొండా చరణ్ అన్నారు. మండల కేం ద్రంలో ఉన్న బి ఎస్ పి మండల కార్యాలయంలో శుక్రవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూఏళ్ల తరబడి అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం కలిగిన కులాల పార్టీలకు అధికారం ఇవ్వడం ద్వారా బహుజనులకు న్యాయం జరగడం లేదన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు బహుజన జాతులకు అందడం లేదన్నారు. కాంగ్రెస్ ,బిజెపి, బిఆర్‌ఎస్ లు బహుజన జాతులకు అధికారం దక్కకుండా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.
సంక్షేమ పథకాలను ఎరవేసి బహుజన జాతులను అధికారానికి దూరం చేయాలే రనీ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఆవుల అన్నపూర్ణ ను పార్టీ కండవ కప్పి పార్టీలో ఆహ్వానించారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, పార్టీలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ఆ పార్టీలను తక్షణమే వీడాలని అనాది గా బహుజన జాతులకు నష్టం చేస్తున్న ఈ పార్టీలకు అధికారం ఇవ్వడం అనేది మన వేలుతో మన కంటిని పొడుసు కున్నట్లే అన్నారు. ఈ కార్యక్రమంలో గోగికార్ రామ లక్ష్మణ్, సామల ప్రవీణ్ ,చెన్నం మోహన్ , గుర్రాల విజయ్ కుమార్ ఎస్కె జహీ రుద్దీన్ భాష తదితరులు పాల్గొన్నారు.