calender_icon.png 28 July, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

26-07-2025 12:27:52 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

.మునగాల, జూలై 25 : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని పి హెచ్ సి ని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆస్పత్రి లో వైద్య సేవలు పొందుతున్న నేపాల్ నుండి వలస వచ్చిన భవాని దేవి, మునగాల వాసి వెంకట్రాములు తో మాట్లాడి వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.

టి హబ్, ఫార్మసి స్టోర్, లేబర్ రూమ్ పరిశీలించారు. తదుపరి జడ్పీ హెచ్ ఎస్ లో  పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ ని విద్యార్థులచే చదివిపించారు అలాగే తెలుగు పదాలు చెప్పి విద్యార్థులతో రాయించారు. మాతృ భాష అయిన తెలుగు భాషపై విద్యార్థులు పట్టు సాధించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంను పరిశీలించి  అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  ఈ కార్యక్రమం లో ఆర్డీఓ సూర్యనారాయణ, తాసిల్దార్ రామకృష్ణారెడ్డి, ఎంపీడీవో దీన్ దయాల్ తదితరులు పాల్గొన్నారు.