calender_icon.png 27 July, 2025 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైం పోలీసులు

26-07-2025 12:29:28 AM

ఖమ్మం, జులై 25 (విజయ క్రాంతి):మీ ఆధార్ కార్డ్ ద్వారా సిమ్ములు తీసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, జాబ్ ఫ్రాడ్స్ , మనీలాండరింగ్ జరిగాయని, ఈ కేసులలో అరెస్టు చేస్తామని నేతాజీ నగర్ ఖమ్మం అర్భన్ మండలం కి చెందిన రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి, సుమారు 59 లక్షల రుపాయలు మోసం చేసిన కేసులో ముగ్గురిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపు రం లో అరెస్టు చేసినట్లు ఖమ్మం సి.పి. సునిల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం అర్భన్ మండలానికి చెందిన రిటైర్డ్ ఉపాద్యాయుడుని ఫోన్ లో జా బ్ ఫ్రాడ్స్ , మనీలాండరింగ్ కి పాల్పడ్డారని, బెంగళూరు పోలీసులమని, డిజిటల్ అరెస్టు చేస్తామని బెదిరించి ఏప్రిల్-2025 లో ఫలుదఫాలుగా సుమారు 59 లక్షలు రూపాయలు దోచుకున్న కేసులో రూ. 9 లక్షలు అకౌంట్ కి వెళ్ళిన ౄ. యెర్రి స్వామిను అరెస్ట్ చేసి విచారించగా తను మరియు ఇంకో ఇద్దరు లక్ష్మానాయక్ మరియు కె .నారాయణ రెడ్డి లను కలిసి నేరం చేసినట్లు ఒ ప్పుకున్నారు .

అట్టి ముగ్గురిని అనంతపురం లో అరెస్ట్ చేసినట్లు, ముగ్గురు నిందితులను ఖమ్మం  సైబర్ క్రైం కోర్టులో హాజరు పరచి, రిమాండ్ కి తరలించారని తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించి, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం లో నిందుతుల్ని అరెస్టు చేసి, ఖమ్మంకి తీసువచ్చి, రిమాండ్ చేసిన సైబర్ క్రైం ఇన్ఛార్జి డి.ఎస్పి. టి. లక్ష్మినారాయణని, ఇన్పెక్టర్ యాసిన్ అలీని, ఎస్త్స్రలు రంజితకుమార్, సహకరించిన ఎస్త్స్ర విజయ్ కుమార్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సి.పి. అభినందించారు.