calender_icon.png 11 January, 2026 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది ముక్కోణ ప్రేమకథ అస్సలే కాదు!

11-01-2026 12:39:28 AM

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఏకే ఎంట ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇందుంలో సంయుక్త మీ నన్, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా సంయుక్త విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమాకూ మంచి ఆదరణ ఉంటుంది. ‘నారీ నారీ నడుమ మురారి’తో సంక్రాంతికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్. పండుగకి పర్ఫెక్ట్ మూవీ. నాకు కామెడీ సినిమా చేయడం చాలా ఇష్టం. -డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఇందులో నా క్యారెక్టర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు ప్రేక్షకులు సహజంగా ముక్కోణ ప్రేమకథ అనుకుంటారు. కానీ ఇది అలా కాదు. డైరెక్టర్ చాలా యూనిక్ పాయింట్‌తో ఈ కథ రాశారు. ఇందులో చాలా మంచి సిచువేషన్ కామెడీ ఉంటుంది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పా.  

శర్వానంద్ చాలా అద్భుతమైన టైమింగ్ ఉన్న హీరో. చాలా సపోర్టివ్, హెల్ప్ ఫుల్‌గా ఉంటారు. ఆయనతో పనిచేయడం చాలా మంచి అనుభూతి కలిగింది. సాక్షి వైద్యకు, నాకు మధ్య మంచి కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. తనంటే నాకు చాలా గౌరవం. తను ప్రతి సీన్‌కి ప్రిపేర్ అయ్యే విధానం చాలా బాగుంటుంది.  డైరెక్టర్ రామ్ అబ్బరాజు చాలా కూల్‌గా ఉంటారు. ఇంత కాంపిటీషన్‌లో సినిమా వస్తున్నా ఆయన ఎలాంటి ఒత్తిడికి గురికావటంలేదు. పోటీ ఉంటేనే బాగుంటుందంటారు.. ఎప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆయన కోపంలో ఉన్నట్లు ఎప్పుడూ చూడలేదు.

చాలా క్లారిటీ వున్న డైరెక్టర్. నిర్మాత -అనిల్‌కి సినిమా అంటే చాలా పాషన్. ఈ సినిమాకు ఆయనే మెయిన్ పిల్లర్. అందర్నీ సపోర్ట్ చేస్తారు. ఆయన కోసం చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకు వైవిధ్యమైన పాత్రలు చేశాను. నా ప్రతి సినిమాకూ వైవిధ్యం ఉంటుంది. నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. బయోపిక్స్ చేయాలని కూడా ఉంది. కామెడీ క్యారెక్టర్స్ కూడా చేయాలనే ఉంది.ఎక్కడున్నా అక్కడ ప్రతి పండుగ జరుపుకోవడం నాకు అలవాటు. సంక్రాంతి పండుగకు అందరూ కూడా మంచి పిండి వంటకాలు మా ఇంటికి పంపిస్తారని కోరుకుంటున్నా (నవ్వుతూ).