ఈ తండ్రీకొడుకుల ఎడబాటుకు కారణం?
డార్లింగ్ కృష్ణ, ప్రకాశ్‌రాజ్, అమృత అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఫాదర్’. ఈ చిత్రాన్ని ఆర్‌సీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్ చంద్రు, యమున చంద్రశేఖర్, ఆనంద్ పండిట్ నిర్మిస్తున్నారు. రాజమోహన్(Rajmohan) దర్శకత్వం వహిస్తున్నారు. ఫాదర్, సన్ బాండింగ్ నేపథ్యంగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
తండ్రిని దేవుడిలా కొలిచే కొడుక్కి.. మళ్లీ జన్మంటూ ఉంటే నాన్నగానే పుట్టాలని కోరుకునేంత ప్రేమను గుండెల నిండా నింపుకుంటాడు ఓ తండ్రి. అంతగా ప్రేమించిన కొడుకును వదిలి తండ్రి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ ఎడబాటుకు కారణం ఏంటి..? కొడుకును వదిలి తండ్రి ఎందుకు దూరంగా వెళ్లిపోవాలని అనుకున్నాడు..? వంటి అంశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. నాగభూషణ ఎన్‌ఎస్, రమేశ్ ఇందిర, అవినాష్, హొన్నవల్లి కృష్ణ, గగన్ బీఏ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: సుజ్ఞాన్; సంగీతం: నకుల్ అభ్యంకర్; డైలాగ్స్: మంజు మాండవ్య; లిరిక్స్: రాంబాబు గోసాల.






