calender_icon.png 31 December, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్

31-12-2025 12:36:49 AM

  1. డిమార్ట్ చేసినందుకు రైతు నుంచి రూ.15వేలు డిమాండ్ 

ప్రైవేటు ఉద్యోగి చేతుల ద్వారా 5వేలు తీసుకున్న అధికారి

నిర్మల్ తహసీల్దార్ కార్యాలయంలో ఘటన

నిర్మల్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏసీబీ నిర్వహించే దాడిలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టినట్టు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. నిర్మల్ టౌన్ ల్యాండ్ రికార్డ్ సర్వేయర్ గా వస్తున్న బాలకృష్ణ వర్మ నిర్మల్ రూలర్ ఇన్చార్జి కూడా కొనసాగుతున్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట భూమికి సంబంధించిన సర్వే చేసి డిమార్ట్ చేసేందుకు మండల సర్వేలను సంప్రదించారు. సర్వేయర్ బాధితుల వద్ద నుంచి 15000 లంచం అడిగారు. వారం రోజుల క్రితం రైతు 5000 ఇచ్చాడు.

మిగతా 10,000 చెల్లించాలని రైతుపై సర్వేయర్ రికార్డ్‌లో పార్ట్ టైంగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు డిమాండ్ చేసినట్టు తెలిపారు. అంత డబ్బు ఇచ్చుకోలేదని 5000 ఇస్తామని రైతు చెప్పిన అధికారులు ఆ పనికి ఒక్కొక్క 7500కు బేరం కుదుర్చుకున్నారు.

దీంతో మంగళవారం 5000 సర్వేయర్ బాలకృష్ణ వర్మ అసిస్టెంట్ నాగరాజుకు ఇవ్వాలని సర్వేయర్ పేర్కొన్నట్టు తెలిపారు. వెంటనే రైతు అదిలాబాద్ ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించాడు. దీంతో లంచం రూ.5వేలు ఇచ్చే సయంలో నిఘాఉంచి నాగరాజును పట్టుకున్నారు. అతన్ని విచారించగా తాను సర్వేయర్లు చెప్తేనే డబ్బులు తీసుకున్నానని చెప్పటంతో ఏసీబీ అధికారులు వారిని కూడా అదుపులో తీసుకొన్నారు.