calender_icon.png 31 December, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సదర్మాట్’పనులను త్వరగా పూర్తి చేయాలి

31-12-2025 12:34:49 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్/భైంసా, డిసెంబర్ 30(విజయక్రాం తి): మిగిలి ఉన్న సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మామ డ మండలం పొన్కల్ గ్రామంలో నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్యారేజీ నిర్మా ణ పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ, సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం దాదాపు పూర్తి అయి పోయిందని తెలిపారు. మిగిలి ఉన్న చిన్న చిన్న పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బ్యారేజీ వినియోగంలోకి వస్తే దాదాపు 18 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు.

రైతులకు ఎంతో ఉపయోగకరం అని వివరించారు. ఆయకట్టు రైతులకు అధికారులు బ్యారేజీ నిర్మాణం, ఆయకట్టు వివరాలు మ్యాపుల ద్వారా వివరించారు. పలువురు స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడారు.ఈ బ్యారేజీ పరిశీలనలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్, ఇంజనీరింగ్, నీటిపారుదల శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.