09-01-2026 12:00:00 AM
హనుమకొండ టౌన్, జనవరి 8 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర 2026 డైరీని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, రాష్ట్ర ఆయిల్ ఫీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. ముందుగా మరణించిన పోలీస్ అధికారు లకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం పోలీస్ సంక్షేమ సంఘం సభ్యులకు హెల్త్ కార్డు పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం జీవితాంతం అంకితభావంతో సేవలందించిన విశ్రాంత పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని తెలిపారు. విధినిర్వహణలో ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇచ్చారని, సమాజానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్రావు, ప్రతినిధులు సంజీవరావు, పులి వీరారెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.