రూ.లక్ష డిఫెన్స్ లిక్కర్ పట్టివేత
51 డిఫెన్స్ మద్యం బాటిళ్ల స్వాధీనం
సికింద్రాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): సికింద్రాబాద్ స్టైల్ యేనియన్ షాపింగ్ మాల్ సమీపంలో మధ్యప్రదేశ్కు చెందిన డిఫెన్స్ బాటిళ్లను అమ్మకాలు జరుపుతున్న మాజీ సైనిక ఉద్యోగిని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఏ టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు.
మాజీ సైనిక ఉద్యోగి కె.విద్యా సాగర్రెడ్డి అనే వ్యక్తి సికింద్రాబాద్లో అమ్మకాలు జరుపుతుండగా 11 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇంట్లో తనిఖీలు నిర్వహించగా మరికొన్ని మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. మొత్తంగా 51 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ డిఫెన్స్ డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను తక్కువ ధరలకు కొనుగోలు చేసి తీసుకొని వచ్చిన మద్యం బాటిళ్లను సికింద్రాబాద్ సైనిక్పురి ప్రాంతంలో చాల రోజులుగా అమ్మకాలు జరుపుతున్నాడు.
పట్టుకున్న 51 మద్యం బాటిళ్ల విలువ రూ. లక్ష మేర ఉంటుందని అంచనా వేశారు పట్టుకున్న మద్యం బాటిళ్లలో 28 టీచర్స్, 18 సేగ్రామ్ స్కాచ్ బాటిళ్లు మిగిలిన మూడు బాటిళ్లు సిగ్నిచర్,వైన్ బాటిళ్లు ఉన్నాయి. ఈ మద్యం బాటిళ్లను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీమ్లో సీఐ ఎస్. చంద్రశేఖర్ గౌడ్, ఎస్త్స్ర శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ అఫ్జల్, కానిస్టేబుళ్లు మురళి, జంగయ్య,శేఖర్, శోబా, శశిధర్లు ఉన్నారు.మద్యం బాటిళ్లను, నిందితుడిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
మత్తు కలిగించే దగ్గు మందు సీసాల స్వాధీనం..
రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏ టీమ్ సీఐ బాలరాజ్, ఎస్త్స్ర వెంకటేష్ సిబ్బంది కలిసి కుత్భుల్లాపూర్ చింతల్ భగత్సింగ్నగర్ లో జక్కుల సాకేత్ అనే వ్యక్తి నిషేదిత దగ్గు మందు సీసాలను అమ్ముతుండగా పట్టుకున్నారు.
ఈ నిషేదిత దగ్గు మందు బాటిళ్లు ఎక్కడి నుంచి తీసుక వచ్చాయని నిందితుడిని ప్రశ్నించినపుడు తులసి మెడికల్ హల్ యజమాని గుండ్ల చంద్రశేఖర్ ఇచ్చాడ ని తెలిపాడు. నిందితుడి సమాచారంతో గుండ్ల చంద్రశేఖర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 10 దగ్గు మందు బాటిళ్లు లభ్యమయ్యాయి. ఇద్దరు నిందితులను 15 దగ్గు మందు సీసాలను కుత్భుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించనట్లు సీఐ బాలరాజు తెలిపారు.






