23 June, 2026 | 11:19 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

సభ సమాప్తం.. సన్మానం అమోఘం!

15-06-2024 12:05 AM
  • కోరం అలకతో జరగని జడ్పీ సర్వసభ్య సమావేశం 

వచ్చే నెల 4తో ముగియనున్న జెడ్పీటీసీల పదవీకాలం 

ఎమ్మెల్యేలు నచ్చజెప్పినా రాని బీఆర్‌ఎస్ జడ్పీటీసీలు 

హాజరైన సభ్యులకు సన్మానం

మహబూబ్‌నగర్, జూన్ 14 (విజయక్రాంతి): గత పదేళ్ల కాలంలో మహబూబ్ నగర్ జెడ్పీ సర్వసభ్య సమావేశం అంటే ఇక ఆరోజంతా సందడిగా ఉండేది. ఈ విడత చివరి జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించేదుకు అధికారులు తీసుకున్నప్పటికీ సభ జరుగకుండనే ముగిసిపోయింది. జూలై 4న జెడ్పీటీసీల పదవీకాలం ముగుస్తుడటంతో శుక్రవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం చివరిది. బీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు సర్వసభ్య సమావేశానికి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు.

బీఆర్‌ఎస్ హాయంలో ఎన్నికైన జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఇదే కార ణం చూపిస్తూ బీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు సర్వసభ్య సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తు న్నామని ప్రకటించి, వెళ్లిపోయారు. దీంతో చివరి జెడ్పీ సర్వసభ్య సమావేశం కావడంతో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి సభ నుంచి వెళ్లిపోయిన సభ్యులను ఆహ్వానించేందుకు సంప్రదింపులు చేశారు. సభ్యులు రాకపోవడంతో దాదాపు 2 గంటల సమయం సభలోనే నిరీక్షించిన ఎమ్మెల్యేలు సభకు హాజరైన జెడ్పీటీ సీలను సత్కరించారు. సభ సమాప్తం కావడంతో హాజరైన జెడ్పీటీసీలను, ఎంపీటీసీ లను ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు శాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించారు.