12 August, 2026 | 3:22 AM

జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

15-06-2024 12:10 AM

ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో పనిచేస్తున్న జర్న లిస్టుల పిల్లలకు నగరంలోని ప్రైవేటు పాఠశాలల్లో 50శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని జిల్లా విద్యాధికారి ఆర్.రోహిణి స్కూళ్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం డిప్యూటీ డీఈవోలు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్‌కుమార్, జగదీశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్ ఆధ్వర్యంలో శుక్రవారం  డీఈవోకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ వినతిపై స్పందించిన డీఈవో యాజమాన్యాలకు ఆదేశాలివ్వడంతో హెచ్‌యూజే ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.