సత్తా చాటిన ఇషా సింగ్
20-04-2024 12:55 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ యువ షూటర్ ఇషా సింగ్ సత్తా చాటింది. శుక్రవారం ఢిల్లీలోని కర్ణిసింగ్ రేంజ్‌లో ప్రారంభమైన ట్రయల్స్‌లో 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ఇషా సింగ్ టాప్ స్కోరు నమోదు చేసింది. 585 పాయింట్లతో ఇషా అగ్రస్థానంలో నిలవగా.. సిమ్రన్‌ప్రీత్ కౌర్ (583), మనూ బాకర్ (582) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. ఇక పురుషుల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో 580 పాయింట్లతో భవేశ్ షెకావత్ టాప్ స్కోర్ పొందగా.. ఆ తర్వాత విజయ్‌వీర్ సిద్ధు (579), అనీష్ (577) ఆ తర్వాత ఉన్నారు. కాగా ఈ పది మంది షూటర్లు మరోసారి శనివారం ఫైనల్ ట్రయల్స్‌లో తలపడనున్నారు. ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన షూటర్లకు పారిస్ టికెట్ దక్కనుంది.






