17 April, 2026 | 5:51 PM

నూతన సర్పంచులను అభినందించిన మంత్రి

16-12-2025 02:20 AM

మునిపల్లి, డిసెంబర్ 15 :రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన బుసారెడ్డిపల్లి, బుదేరా, కంకోల్, ఇబ్రహీంపూర్ తదితర గ్రామాల సర్పంచులు రేణుక వెంకట్రాములు, మల్లేశం, మమత , అశోక్ తదితరులు సోమవారం సంగారెడ్డిలోని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన సర్పచులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బుసారెడ్డిపల్లి ఉప సర్పంచ్ పడమటి సంతోష్, వార్డు సభ్యులు సార నాగరాజ్, రమేష్, మొల్ల షాహిద్, తదితరులు పాల్గొన్నారు.