రవాణా శాఖమంత్రి రాజీనామా చేయాలి
- పొన్నం తీరు చూస్తే అవగాహన లేని తనం
- ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన బిజెపి, తీన్మార్ మల్లన్న పార్టీ ప్రతినిధులు
- శంకర్ గౌడ్ కు నివాళులర్పించిన ఆర్టీసీ కార్మికులు
- కామారెడ్డి లో మానవ హారం నిర్వహించిన ఆర్టీసీ కార్మికులు
- డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను అడ్డుకున్న పోలీసులు
- అరగంట పాటు ఉద్రిక్తత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
కామారెడ్డి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా చేయాలని కామారెడ్డిలో శుక్రవారం ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. మూడవరోజు ఆర్టిసి కార్మికుల సమ్మెలో భాగంగా కామారెడ్డి బస్టాండ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా స్థానిక బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు బిజెపి నాయకులు, బిజెపి కౌన్సిలర్ లు, రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న పార్టీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కోరుతున్నాం కోరికలు గొంతమ్మ కోరికలు కావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే తప్ప వేరే వి అడగడం లేదన్నారు.
ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అందించాలన్నారు. రిక్రూట్మెంట్ విధానాన్ని ప్రభుత్వం ద్వారా జరపాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, ప్రైవేటు యజమాన్యాలను ప్రోత్సహించవద్దని ప్రభుత్వమే కొత్త బస్సులు కొని ఆర్టీసీలో నడిపించాలన్నారు. ప్రవేట్ వ్యక్తులకు చెందిన బస్సులే 60 శాతం ఉన్నాయని, ఆర్టీసీకి సంబంధించిన బస్సు లు 40% శాతంమాత్రమే బస్సులు ఉన్నాయని అన్నారు.
ప్రైవేటు యజమానియాలను ప్రోత్సహించకుండా ప్రభుత్వమే నేరుగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వం తరఫున బస్సులను కొనుగోలు చేసి నడిపించాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కుటుంబానికి రెండు కోట్లు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులను బస్టాండ్ లోకి రాకుండా పోలీసులు భారీకేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికులను నినాదాలు చేశారు. ప్రజా పాలన పేరుతో ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తే అడ్డుకునే ప్రయత్నం చేయడం తగదన్నారు.
ఆఫీసులో యూనియన్లకు ప్రభుత్వం సహకారం ఇవ్వాలని కోరారు. అటిసి కార్మికులు కనీసం డిపం మేనేజర్ వద్దకు వెళ్లే స్వేచ్ఛ లేకుండా పోయిందని, యూనియన్లకు అవకాశం కల్పిస్తే కార్మికుల సమస్యలను నేరుగా తమ దృష్టికి ప్రభుత్వ దృష్టికి తెచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.






