25 April, 2026 | 2:13 AM

నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

25-04-2026 12:34 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, ఏప్రిల్ 24(విజయ క్రాంతి) : నిరుపేదల సొంత ఇంటి  కళను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ మండలం శివాయపల్లి గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణంలో లబ్ధిదారుల ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ గృహాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో భాగంగా  శివాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు తోట లక్ష్మి  గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పక్కాగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి వారికి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.  ఇందిరమ్మల నిర్మాణం కోసం ప్రభుత్వం విడుదల వారీగా నిధులు విడుదల చేస్తున్నారు. ఒక్కో గృహ నిర్మాణానికి ఐదు లక్షలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 750 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యాయని, మిగిలిన వారు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 650 ఇండ్లు గృహప్రవేశాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, హౌసింగ్ పీడీ మాణిక్యం, సర్పంచ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.