calender_icon.png 25 December, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్‌ను పరామర్శించిన మంత్రులు

25-12-2025 12:14:24 AM

సుల్తానాబాద్, డిసెంబర్ 24 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్  తండ్రి అంతటి రాజలింగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం సుల్తానాబాద్ లో అంతటి అన్నయ్య ను వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రులు  దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి, పెద్దపల్లి ఎమ్మెల్యే  చింతకుంట విజయ రమణారావు లు  పరామర్శించి,  ప్రగాఢ సానుభూతి సంతాపన్ని తెలిపారు, అంతటి రాజలింగు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు...

ఈ కార్యక్రమం లో స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నాయకులు శ్రీగిరి శ్రీనివాస్, గాజుల రాజమల్లు, ధనాయక్ దామోదర్ రావు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.