calender_icon.png 25 December, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీలకు నెల రోజుల్లో నిధులివ్వాల్సిందే

25-12-2025 12:13:10 AM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాబోెయే నెల రోజుల్లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు.బుధవారం కరీంనగర్ లోని రేకుర్తి శుభం గార్డెన్స్‌లో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిన తరువాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ సాకుతో నిధుల విడుదలలో జాప్యం చేస్తే కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

గెలిచాక సర్పంచుల ప్రవర్తనలో మార్పు రావొద్దని, ప్రజలను చిరునవ్వుతో పలకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ ఇన్‌చార్జి డాక్టర్ మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.