25-12-2025 12:15:36 AM
వెల్గటూర్, డిసెంబర్24(విజయక్రాంతి): వేసవికాలంలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలోని 10వ వార్డులో బుధవారం సర్పంచ్ బండమీది కవితగోపి నూతన బోర్ మోటార్ ను ప్రారంభించారు. రానున్న వేసవి కాలం దృ ష్ట్యా కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.
గ్రామంలో ఏ సమస్యలు ఉన్న ప్రజ లు తమ దృష్టికి తీసుకురావాలనీ, ప్రజా హితం కోసం చేపట్టే పనుల్లో ప్రజలు భాగస్వాములు అవుతూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గండ్ర ప్రతా ప్ రావు, పంచాయతీ కార్యదర్శి ఎం.శ్రీనివా స్, వార్డు సభ్యులు గుండాటి సందీప్ రెడ్డీ, బందెల నర్సయ్య, రంగు సుజాత, ఎర్రోళ్ల దీపక్ కుమార్, కస్తూరి సుమలత, ద్యావనపెల్లి శిరీష, కాలనీ వాసులు పాల్గొన్నారు.