19 May, 2026 | 10:42 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులకు సన్మానం

15-01-2026 01:35 AM

గరిడేపల్లి, జనవరి 14 : మండల నూతన ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కొండ సైదులు గౌడ్ (విజయక్రాంతి), కార్యదర్శి ఎల్లావుల వెంకటేష్ లను బుధవారం హెచ్.ఎన్.ఎస్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారిని శాలువా పూలమాలతో సత్కరించారు.

అనంతరం ఫౌండేషన్ సభ్యులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నీలా హేమ్లనాయక్ మాట్లాడుతూ మండలంలో ఉన్న ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

జర్నలిజం విలువలను పాటిస్తూ పత్రిక మిత్రులు రాజకీయాలకతీతంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గుగులోతు సందీప్ నాయక్, నరేందర్ నాయక్, బచ్చలకూరి కోటయ్య, కేతావత్ నాగరాజు పాల్గొన్నారు.