15-10-2024 12:00:00 AM
రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇప్పుడంటే అవకాశాల్లేవు కానీ ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఈ ముద్దుగుమ్మ చాలా అవమానాలను ఎదుర్కొందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన ఓ చిత్రంలో కథానాయికగా తనను తీసుకుని ఒక షెడ్యూల్ పూర్తున తర్వాత చెప్పా పెట్టకుండా తనను తీసేసి కాజల్‌ను పెట్టుకున్నారట.
అసలు రకుల్ ఏం చెప్పిందంటే.. “ ప్రభాస్‌తో ఓ సినిమాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యాక నేను ఢిల్లీ వెళ్లాను. తర్వాత షెడ్యూల్‌కు నాకు కాల్ రాలేదు. అదేమని అడిగితే కాజల్‌ను కథానాయికగా తీసుకున్నామన్నారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది” అని రకుల్ తెలిపింది. ఇలాంటి అవమానాలు ప్రారంభంలో తన కు చాలా ఎదురయ్యాయని చెప్పుకొ చ్చింది.