30 June, 2026 | 2:13 AM

దేశానికే ఆదర్శం ముల్కనూర్ సంఘం

30-06-2026 12:49 AM

ప్రపంచ దేశాలకు దిక్సూచి

రైతు అప్పులు గ్రామాల్లో 100 శాతం రికవరీ

పంట అప్పు కింద కోటి రుణమాఫీ

సహకార సంఘం అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి

భీమదేవరపల్లి, జూన్ 29 (విజయక్రాంతి): ప్రపంచ దేశాలకు ముల్కనూరు సహకార సంఘం దిక్సూచిగా, దేశానికే ఆదర్శం గా నిలిచిందని సహకార బ్యాంకు అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. సోమవారం దివంగత బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షుడు అ లిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి 40వ వర్ధంతిని బ్యాంకు ఆవరణలో నిర్వహించారు.

సభలో బ్యాంక్ అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సహకార బ్యాంకులో ప్రతిరోజు రైతులు తమ అవసరాలు నిమిత్తం 2000 మంది రైతులు లావాదేవీలు నిర్వహిస్తున్నారు అన్నారు. సహకార బ్యాంకు పరిధి లోని 1000 మంది మహిళా రైతులకు నూ తనంగా వస్తున్న వ్యవసాయ పనులపై ప్రత్యే క శిక్షణ ఇస్తున్నామన్నారు. సంఘ సభ్యులు మృతి చెందితే పంట అప్పు కింద 135 మం ది రైతులకు ఒక కోటి రూపాయలు మాఫీ చేసినట్టు తెలిపారు.

ముల్కనూర్ బ్యాంక్ రైతులకు ఇచ్చిన రుణాలు 100 శాతం రికవరీ చేసి ఆదర్శంగా నిలిచామన్నారు. దివం గత అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి స్ఫూర్తితో రైతులు ఐక్యవంతంగా ఉండి క్రమశిక్షణతో ఉండడం వల్లనే అన్ని సాధ్యమవుతున్నాయన్నారు. తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా గత 15 సంవత్సరాలుగా రైతులకు ఎలాంటి యూరియా కొరత రాకుండా చేశామన్నారు.

ముల్కనూర్ సహకార సంఘం పనితీరుపై కేంద్రం ప్రత్యేకంగా సహకార కేంద్ర శాఖ మంత్రి నియామకంతో పాటు ప్రత్యేక బైలా తయారు చేయడంలో ముల్కనూర్ సహకార బ్యాంకు పనితీరు ఆదర్శమన్నారు. రైతు లు పండించిన పంటలకు మధ్యవర్తికి లాభా లు పోకుండా నేరుగా రైతుకు లాభం చేసే విధంగా సంక్షేమ పథకాలు తయారు చేశామన్నారు.

దేశంలోనే ఎక్కడ లేని విధంగా 135 మంది రైతులు మృతి చెందితే పంట అప్పు పూర్తిగా మాఫీ చేసి వారికి కోటి రూ పాయలు లాభం చేకూర్చామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదివేల సంఘాలు అం దులో విత్తనోత్పత్తి, కూరగాయల ఉత్పత్తి, పా లు విక్రయం, పశు సంఘాలు ఏర్పాటుకు స న్నాహాలు చేస్తున్నాయన్నారు. సభలో బ్యాం క్ జీఎం మారుపాటి రామ్‌రెడ్డి, ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్రవంతితో, రైతులు పాల్గొన్నారు.