calender_icon.png 9 November, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడిన బాలిక మిస్సింగ్ మిస్టరీ

09-11-2025 12:16:10 AM

కొన్ని గంటల్లోనే కేసును ముగించిన జవహర్‌నగర్ పోలీసులు

జవహర్‌నగర్, నవంబర్ 8 (విజయక్రాంతి): జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొ రేషన్ పరిధిలో తప్పిపోయిన ఏడవ తరగతి బాలిక మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. పోలీసులు సకాలంలో స్పందించి, కొన్ని గంటల్లోనే బాలిక ఆచూకీని కనిపెట్టి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. జవహర్ నగర్ ప్రాంతంలోని నోబుల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న శృతిక అనే బాలిక శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయింది.

ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలిక తల్లిదండ్రు లు, బంధువుల ఆక్రందన, ప్రజలు, ప్రజాసంఘాల ఆందోళనతో నోబుల్ స్కూల్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.బాలిక తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు అందుకున్న జవహర్ నగర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఐ సైదయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ వేణుమాధవ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తమదైన శైలిలో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా పోలీసులు బాలిక ఆచూకీని కొన్ని గంటల్లోనే ఛేదించారు.

కుటుంబ కలహాలే కారణం

ఈ సందర్భంగా ఎస్‌ఐ వేణుమాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి కారణంగా బాలిక జనగామ దగ్గరలోని ఇటిక్యాల గ్రామంలో ఉన్న వారి బంధువుల ఇంటికి వెళ్లిందని తెలిపారు. ఆపై బాలికను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పజెప్పినట్లు వివరించారు. సకాలంలో స్పందించి కేసును ఛేదించిన పోలీసుల బృందాన్ని స్థానికులు అభినందించారు.

 ఎస్‌ఐ