22 June, 2026 | 2:32 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

కొత్త కంగారు

11-11-2024 12:07 AM

ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచిన పాక్

పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాక్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 2 తేడాతో విజయం సాధించింది. హరిస్ రౌఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సొంతం చేసుకున్నాడు.  తొలి వన్డేలో ఆసీస్ గెలవగా.. రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమంచేసింది. ఇక నిర్ణయాత్మక మూడో వన్డేలో కూడా పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

స్వదేశంలో వరుసగా సిరీస్‌లు ఓడిపోతున్న పాక్‌కు ఈ సిరీస్ విజయం ఊరటే అని చెప్పాలి. ఈ సిరీస్‌లో పాక్ జట్టుకు కీపర్ రిజ్వాన్ కెప్టెన్సీ చేశాడు. మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా కేవలం 31.5 ఓవర్లలోనే చాపచుట్టేసింది. కేవలం 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఆడుతూ పాడుతూ చేధించింది. షాహిన్ అఫ్రిది, నసీమ్ షా చెరి మూడు వికెట్లతో ఆసీస్ పతనంలో కీలకపాత్ర పోషించారు. 14 నుంచి మూడు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది.