calender_icon.png 27 January, 2026 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దగూడెం తండా నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభం

27-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా అధ్యక్షులు శివ సేనా రెడ్డి

వనపర్తి మండలం, జనవరి 26 : వనపర్తి మండలం పెద్దగూడెం తండా రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేనరెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నుకోబడ్డ శ్రీ వాళ్య నాయక్ ని సర్పంచ్ చాంబర్లో శాలువాలు పూలమాలలతో సత్కరించి సన్మానించారు.

గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు పనిచేయాలని, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని వారు సూచించారు. గ్రామాభివృద్ధికి కావలసిన పనుల మంజూరిలో ఎల్లవేళలా సహకరిస్తామని ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మండల మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, మండలాధ్యక్షుడు రవి కిరణ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మార్కెట్ మాజీ అధ్యక్షులు ఎత్తం రవి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.