27-01-2026 02:02:55 AM
కళ్లకు గంతలు కట్టుకున్న స్పీకర్!
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి) : మహాభారతంలో కళ్లు ఉండి కూడా అన్యాయం చూడలేని ధృతరాష్ర్టు ని లెక్క ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ వ్యవహరిస్తు న్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. చేవెళ్లలో ఐదేళ్ల పిల్లగాన్ని అడిగినా ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెబుతారని, కానీ స్పీకర్ మాత్రం ఆయ న బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎంపీపీ విజయ్ భాస్కర్ తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ భవ న్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, కాలే యాదయ్య మంచి దోస్తు లని, ఒకే బండి మీద ఎక్కి తిరగేటోళ్లని గుర్తు చేశారు.
అయితే బీఆర్‌ఎస్‌లో గెలిచిన యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేర డంపై బీఆర్‌ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే వాస్తవాలు చూడలేకపోతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుం టే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఉంటే కాలే యాదయ్య కాంగ్రెస్‌లోనే ఉన్నారని ఒప్పుకుని, రాజీనామా చే యించి ఉప ఎన్నికలకు వెళ్లేంత ధైర్యం రేవంత్‌రెడ్డికి ఎందుకు లేదని నిలదీశారు.
రెండేళ్లలో ఏ ఒక్క వర్గాన్నీ వదిలిపెట్టలే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి రెండేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని కేటీఆర్ విమర్శిం చారు. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ను పక్కన పెట్టారని, పరిపాలనను వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మో సం చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్ నాయకులు తులం బం గారం పెట్టడం కాదు, ఆడబిడ్డల మెడలో పుస్తెల తాడు కూడా గుంజుకునోపోతారని మేము చేవెళ్లలో ప్రచారం చేసేటప్పుడే చె ప్పామని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు కాంగ్రెస్ బుట్టలో పడినం దుకు ప్రస్తుతం అందరం బొందలో పడినట్టు అయిందన్నారు. కేసీఆర్ పాలనలో సంతోషంగా ఉన్న అన్ని వర్గాలు ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
గట్టిగా అడిగితే కేసులు..
కేసీఆర్ అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, ప్రతి ఏటా డిసెంబర్ 26 కంటే ముందే రైతుబంధు డబ్బులతో అందరి ఫోన్లు టింగ్ టింగ్ అని అనేవని గుర్తు చేశారు. ఇప్పుడు జనవరి 26 వచ్చిన ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో రైతు బంధు పడలేదని విమర్శించారు. ఆడబిడ్డలకు బతుకమ్మకు చీరో, రైక ముక్క అయి నా పెట్టారా, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక ఇచ్చారా అని ప్రశ్నించారు.
చేసేందేమీ లేదు.. గట్టిగా అడిగితే కేసీఆర్ మీద, మా మీద కేసుల పెట్టి పోలీసోళ్ల ముందు కూ ర్చోబెడతారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి భాష కు మొక్కాలని, ఆయన మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయాలని, లేకపోతే పిల్లలు చెడిపోతారని సూచించారు. ఏ తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు ఆగమయ్యారో, వారిని మళ్లీ బాగుచేయాలంటే కేసీఆర్‌ను తెచ్చుకోవాలనే ఉద్దేశంతో తన, సబిత ఇంద్రారెడ్డి కొట్లాట అని స్పష్టం చేశారు.
కేసీఆర్ చెప్పని పనులు కూడా చేశారని, తాము ఒక్కొక్క పనిని సగబెట్టుకుంటూ వస్తే.. ప్రస్తుతం వీళ్లు ఎగబెట్టు కుంటూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలప్పుడు మళ్లీ వచ్చి రెండు వేలు చేతులో పెడతారని, మోసపోవద్దని సూచించారు. 26 నెలలుగా 60 వేలకుపైగా బాకీ ఉన్నారని, రెండు వేలు తీసుకుని మళ్లీ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయొద్దని సూచించారు.
ఈ సారి ఓట్లకు ఇంటికి వస్తే బాకీ ఉన్న పైసలు ఎవరి ఇస్తారు కొడుకా.. యాదయ్య ఇస్తడా, బీం భరత్ ఇస్తడా అని నిలదీయాలని పిలుపునిచ్చారు. మీరు అడగకుంటా మూగనో ము పడితే, మళ్లీ మోసం జరుగుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం చేవెళ్ల ప్రజలకు వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని, నిలదీయాలని చెప్పారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే రాష్ట్రంలోని పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.