calender_icon.png 27 January, 2026 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత భారత్ వైపు

27-01-2026 01:55:51 AM

ఇప్పుడిదే.. యావత్ దేశ ప్రజల సంకల్పం

రిపబ్లిక్ డే జాతీయ పండుగ మాత్రమే కాదు..

భారత పౌరుల ఆత్మగౌరవ నినాదం

గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ

మువ్వన్నెలతో రెపరెపలాడిన ఢిల్లీ కర్తవ్యపథ్

ఆకట్టుకున్న ‘సిందూర్’ ‘శక్తిబాన్’, ‘దివ్యాస్త్ర’ శకటాలు

న్యూఢిల్లీ, జనవరి 26:  రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం కావాలంటే దేశ ప్రజలందరిలో ఒకే సంకల్పం ఉండాలని, అదే వికసిత భారత్ సంకల్పమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు యావత్ దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తోందని ఉద్ఘా టించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం  కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే అనేది కేవలం ఒక జాతీయ పండుగ మాత్రమే కాదని ఇది భారతదేశ ఆత్మగౌరవానికి చిహ్నమని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడిలో ఈ వేడుకలు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాయని పేర్కొ న్నారు. ౧౧ ఏళ్ల నుంచి దేశం అద్భుతమైన ప్రగతిని సాధించిందని వివరించారు.

రాబోయే కాలంలో భారత్‌ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రతిఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత, శ్రామిక శక్తి పాత్ర కీలకమైందన్నారు. వేడుకలో ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్, కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియో కోస్టా పాల్గొనడం ఆనంద దాయకమని ఆయన కొనియాడారు.  వారు వేడుకలో పాల్గొనడం దేశానికి దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు.

రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను చాటుతూ ‘శక్తిబాన్’, ‘దివ్యాస్త్ర’ వంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ప్రపంచానికి పరిచయం చేశామని వివరించారు. ఈ ప్రదర్శన దేశ సంసిద్ధతను, సాంకేతిక సామర్థ్యాన్ని, పౌరుల రక్షణ పట్ల ఉన్న నిబద్ధతను చాటుతోందని ఆయన అన్నారు. మహిళా శక్తికి అద్దం పడుతూ సీఆర్పీఎఫ్ మహిళా దళం నిర్వహించిన పరేడ్ అబ్బురపరిచిందని ప్రధాని ప్రశంసించారు.

తొలిసారిగా ఐరోపా రక్షణ దళం మన కవాతులో భాగం కావడం చారిత్రాత్మకమని మోదీ అభివర్ణించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందేమాతరం శకటాలు భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని, గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని.. కర్తవ్య పథ్ పరేడ్‌ను వర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పరేడ్ దేశ ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమని అభివర్ణించారు.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ కవాతును వీక్షించడం జాతీయ స్ఫూర్తిని పెంచుతుందని ఆకాంక్షించారు. భారతదేశం మరో దశాబ్ద కాలంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో అతిపెద్దశక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సంపూర్ణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో వికసిత భారత్ లక్ష్యం త్వరలోనే సిద్ధం అవుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

వికసిత భారత్ ప్రయాణంలో ప్రతి గ్రామం, ప్రతి నగరం భాగస్వామ్యం కావాలని ప్రధాని కోరారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే మన మూలాలను మరువకుండా ముందుకు సాగాలని సూచించారు. దేశ భద్రత విషయంలో రాజీ లేని పోరాటం సాగిస్తామని రక్షణ దళాల సామర్థ్యంపై నమ్మకాన్ని ప్రకటించారు. 

దేశాధినేతల శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవం సందర్భం గా అనేకమంది ప్రపంచ దేశాధినేతలు భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 పంపిన సందేశంలో భారత్-బ్రిటన్ దే శాల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులను అహ్మదాబాద్‌కు దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా భారత్-  మంచి పొరు గు దేశాలుగా అభివర్ణిస్తూ, డ్రాగన్ ఏనుగు నృత్యాన్ని ప్రతీకగా పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత్‌ను ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడారు. ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ స్పందిస్తూ.. అతి గొప్ప దేశమైన భారతదేశంలో తాను మూడు రోజుల పర్యటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 

‘ఆపరేషన్ సిందూర్’ కవాతు అదుర్స్ 

పరేడ్‌లో భారత అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధ సంపత్తి నమూనా శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఆపరేషన్ సిందూ ర్’ శకటం పరాక్రమాన్ని ప్ర తిబింబించేలా  ఉంది. వేడుకల్లో తొలిసా రిగా యూరోపియన్ యూనియన్‌కు చెందిన రక్షణ దళం కూడా కవాతులో పాల్గొంది. అలాగే దేశీయంగా తయారైన ‘శక్తిబాన్’, ‘దివ్యాస్త్ర’ వంటి అత్యాధునిక డ్రోన్, ఆర్టిలరీ వ్యవస్థలు తొలిసారిగా ప్రపంచానికి పరిచ య మయ్యాయి. ఇవి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం విశేషం.

సైనిక శక్తి మాత్రమే కాకుండా, ‘వందేమాతరం’ గీతం ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ సాం స్కృతిక వైభవాన్ని చాటేలా వివిధ రాష్ట్రాల శకటాలు ప్రదర్శనలో కనువిందు చేశాయి. మహిళా సాధికా రతకు అద్దం పడుతూ మొదటిసారిగా మహిళా అగ్నివీర్ల సంగీత బృందం, సిమ్రాన్ బాలా నేతృత్వంలోని సీఆర్పీఎఫ్ మహిళా దళం కవాతులో ప్రత్యేకంగా నిలిచాయి. కర్తవ్య పథ్‌లో సాగిన ఈ అద్భుత ప్రదర్శన నవ భారత్ ఆత్మవిశ్వాసాన్ని చాటింది.