27-01-2026 12:00:00 AM
జంగం పద్మమ్మ శివ
పెద్దమందడి జనవరి 26 : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించు కొని, పెద్దమందడి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ముఖా ల్లో చిరునవ్వులు విరిశాయి. స్థానిక 8వ వా ర్డు మెంబర్ జంగం పద్మ శివ విద్యార్థుల చదువుపై ఉన్న మక్కువతో, వారికి అండగా నిలవాలనే సంకల్పంతో అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు చదువు భా రం కాకూడదనే ఉద్దేశంతో పద్మ శివ తన సొంత ఖర్చులతో నోట్ బుక్స్, పెన్నులు, రై టింగ్ ప్యాడ్లు మరియు స్టేషనరీ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండే పిల్లలకు నాణ్యమై న విద్యతో పాటు సమాజం పట్ల బాధ్యతను నేర్పించాలని, తమ వంతుగా విద్యార్థులకు ఇలాంటి సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సూర్య గంగమ్మ రవి,వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు కాలనీ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.