ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి..
25-03-2026 12:00 AM
గాంధారి , మార్చ్ 24 ( విజయ క్రాంతి ) : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు , ఉపాధి హామీ సిబ్బంది సమన్వయంతో గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రానున్న రోజుల్లో ఎండల తీవ్రత దృష్ట్యా వారికి కనీస వసతులు ఏర్పాటు చేయాలని ఆయన ఉపాధి సిబ్బందికి సూచించారు. అందరికీ పని కల్పించాలని ఆయన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, ఈసి మధు, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




