25 March, 2026 | 1:42 AM

రోడ్లపై స్టంట్లు చేస్తే రిమాండ్

25-03-2026 12:00 AM
  1. సైఫాబాద్ సీఐ సీతయ్య

రీల్స్ కోసం బైక్ విన్యాసాలు చేస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

ఖైరతాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): నగరంలోని అత్యంత భద్రత కలిగిన ప్రాంతాలైన సెక్రటేరియట్, లుంబిని పార్కు పరిసరాల్లో బైక్ స్టంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ’రీల్స్’ పిచ్చితో ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తున్న వీరిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ సీతయ్య వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారంముషీరాబాద్లోని భోలక్పూర్కు చెందిన మొహమ్మద్ అఖీల్ (19), అఘాపురాకు చెందిన మొహమ్మద్ అతీక్ (22) అనే యువకులు గత కొంతకాలంగా తమ మోటారు సైకిళ్లపై సెక్రటేరియట్ సమీపంలోని బహిరంగ రహదా రులపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో గుర్తిం పు పొందాలనే ఉద్దేశంతో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సామాన్య వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు పోలీసు లు గుర్తించారు.

వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సైఫాబాద్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి స్టంట్లు చేయడానికి వాడిన బైక్లు, వీడియోలు చిత్రీకరించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకు న్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో ఐఓ వి. పరమేశ్వరి, కానిస్టేబుళ్లు సంపత్ కుమార్, విజయ్ కుమార్, లింగస్వామి, మహేష్ కీలక పాత్ర పోషించారు.