09-01-2026 12:00:00 AM
విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన
ఖైరతాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కళాశాల, అంబిషన్ సంస్థ సంయుక్తంగా గురువారం జూనియర్ కళాశాల విద్యార్థులకు కామర్స్ టాలెంట్ టెస్ట్‌ను నిర్వహించింది. జంట నగరాలకు చెందిన వివిధ కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ తెలియజేశారు. ఈ పరీక్షలో కామర్స్‌కు సంబంధించిన అంశాలపై 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో రెండు గంటల పాటు పరీక్ష నిర్వహించారు.
తదనంతరం కామర్స్ టాలెంట్ టెస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జె.చంద్రిక (తపస్య జూనియర్ కళాశాల) మొదటి బహుమతి రూ.3 వేలు, అప్నన్ అమ్రీన్ (సంగం లక్ష్మీ కళాశాల) రెండవ బహుమతి రూ.2వేలు-, ఆద్యారెడ్డి, సాయి కీర్తన (సంగం లక్ష్మీ కళాశాల) మూడవ బహుమతి రూ. వెయ్యి, అనూష, విద్యాయాదవ్, సిమ్రాని అర్జున్ (ధర్మవీర్ వుమన్ కళాశాల), కేశవ్ అట్టల్ (వివేకా వర్ధిని కళాశాల), హీరాల్ షేక్ (సంగం కళాశాల) విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులుగా ఒక్కొక్కరు రూ.500 చొప్పున గెలుచుకున్నారు. కార్యక్రమంలో కళాశాల డీన్లు సంతోషి, తిరుమలరావు, కామర్స్ టాలెంట్ టెస్ట్ కో ఆర్డినేటర్ నాగ శిరీష పాల్గొన్నారు.