30 June, 2026 | 2:12 AM

ప్రజల ఫిర్యాదుల పరీక్ష పరిష్కారమే ప్రజాదివస్ లక్ష్యం

30-06-2026 12:00 AM

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 29 (విజయక్రాంతి): ప్రజల నుంచి ఫిర్యాదులకు తక్షణ పరిష్కారమే ప్రజాదివాస్ కార్యక్రమ లక్ష్యమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజాదివాస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన 19 ఫిర్యాదులను స్వీకరించగా, ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులతో సమీక్షించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు మరింత చేరువగా ఉండి సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు.