13 April, 2026 | 1:34 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

ప్రేమించిన వాడే కడతేర్చాడు

26-09-2024 03:01 AM

బావతో కలిసి ప్రియురాలిపై లైంగికదాడి 

ఆపై గొంతు నులిమి హత్య

పుట్టలగడ్డ తండాలో యువతి అనుమానాస్పద మృతిపై వీడిన మిస్టరీ 

నల్లగొండ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డ తండాలో యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితోపాటు అతడి సొంత బావ యువతిపై అత్యాచారం చేసి గొంతు నులిమి హతమార్చినట్లు విచారణలో గుర్తించారు.

ప్రియుడితోపాటు అతడి బావ, సహకరించిన తల్లిని బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిర్యాలగూడ పట్టణం లోని తన కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు మీడియాకు కేసు వివరాలు వెల్లడిం చారు. దామరచర్ల మండలం పుట్టలగడ్డ తండాకు చెందిన రూపావత్ నాగు అదే గ్రామానికి చెందిన యువతి (19) ప్రేమించుకున్నారు.

ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో నాగును నిలదీసి కూతురును పెళ్లి చేసుకోవాలని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. దీంతో ప్రియురాలి అడ్డు తొలగించుకోవాలని భావించిన నాగు ఆమె ను నమ్మించి ఈ నెల 14న పథకం ప్రకారం ఊరు శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అప్పటికే నాగు బావ క్రాంతి, తల్లి బుజ్జి  అక్కడికి చేరుకున్నారు. తల్లిని కాపలాగా ఉంచి నాగు అతడి బావ క్రాంతి యువతిపై లైంగికదాడి చేశారు. ఆ తరువాత గొంతు నులిమి చంపి చెట్టుకు ఉరివేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో వాస్తవా లు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.