calender_icon.png 6 December, 2024 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాస్పద భూమిలో నిర్మాణాలు

26-09-2024 03:00:01 AM

అడ్డుకున్న అఖిలపక్ష నాయకుల అరెస్టు

మహబూబాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): వివాదాస్పద భూమిలో చేపడు తున్న నిర్మాణాలను బుధవారం అఖిలపక్ష నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని సర్వే నం బర్ 687లోని భూమి తమదంటూ కొంద రు నిర్మాణాలు చేపడుతున్నారు.

అయితే ఈ భూమిని పదేళ్ల క్రితమే గ్రామాభివృద్ధి కోసం శేషగిరిరావు అనే వ్యక్తి తెల్లకాగితంపై రాసిచ్చారని, 2010లో గ్రామకంఠంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైనట్లు అఖిలపక్ష నాయకు లు తెలిపారు. ఆందోళనల నేపథ్యంలో ఎలా ంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అఖిలపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.