5 August, 2026 | 2:44 AM

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి

05-08-2026 01:23 AM

మంత్రి వివేక్ వెంకట స్వామి

మందమర్రి, ఆగస్టు 4 : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షే మ పథకాల అమలులో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అం దేలా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార , గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. మంగళవారం మందమర్రి మండల కేంద్రంలో గల బి 1 క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మం డల తహసిల్దార్ సతీష్ కుమార్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల కమిష నర్లు రాజలింగు, మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు.

జిల్లాలో సి.ఎస్.ఆర్., డి.ఎం.ఎఫ్.టి. నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగ వంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. మందమర్రి ప్రాం తంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 95 శాతం చెల్లింపులు చేయడం జరిగిందని, మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. క్యాతనపల్లి మున్సిప ల్ పరిధిలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టామన్నారు.

మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, గృ హ నిర్మాణ శాఖల అధికారులతో ఆయా శా ఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను స్వీకరించి, ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేస్తూ, సమస్యలను నిబంధనల మేరకు పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.