calender_icon.png 20 December, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలను పరామర్శించిన పీఏసీఎస్ చైర్మన్

20-12-2025 01:44:45 AM

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), డిసెంబర్19: ఇటీవల పలు ప్రమాదాల్లో గాయపడిన,మృతి చెందిన,అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబాలను ఉమ్మడి జాజిరెడ్డిగూడెం మండల పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని కొమ్మాల గ్రామానికి చెందిన సూరారపు ముత్తమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా జిల్లా కేంద్రం సూర్యాపేటలోని ఆసుపత్రిలో పరామర్శించి ఆసుపత్రి ఖర్చులను భరించారు.

అదేవిధంగా గ్రామానికి చెందిన సూరారపు సురేష్ ను,ఆరే అశోక్ ను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యం నింపారు.ఈ కార్యక్రమంలో సూర్యనాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్,మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, నాయకులు సూరారపు,గుండె ఈశ్వర్,కన్నెబోయిన ఉపేందర్, సూరారపు శ్రీను, కుక్కడపు సైదులు, గడ్డం, కుంట్ల శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.