గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, ఏప్రిల్ 22: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర పౌరసరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ వ్యవస్థాపకులు, గంజి చంద్రమౌళి మృతి పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
గంజి చంద్రమౌళి తన చిరకాల మిత్రుడని,ఆప్తుడని, శ్రేయోభిలాషి అని అతని మృతి చాలా బాధాకరమని మంత్రి ఉత్తమ్ తెలిపారు.వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ,తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్ ఫంక్షన్ హాల్ ను స్థాపించిన చంద్రమౌళి ఈ ప్రాంత ప్రజల మనసును చురుగొని,అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందారని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేయడం కోసం నిస్వార్ధంగా పనిచేసిన వ్యక్తి అని మంత్రి కొనియాడారు.
గంజి చంద్రమౌళి మృతి అత్యంత బాధాకరం
గంజి చంద్రమౌళి మృతి అత్యంత బాధాకరమని మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి అన్నారు.బుధవారం పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో చంద్రమౌళి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, చంద్రమౌళి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ...చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నిబద్ధతతో పార్టీ గెలుపుకై కృషి చేశాడని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.






