ప్రజలే ప్రాణం.. అభివృద్ధే మంత్రం
అసెంబ్లీలో, అంతర్జాతీయ వేదికల మీద అంతటా చక్రం తిప్పుతున్న ధన్వాడ ముద్దుబిడ్డ, మంథని పులిబిడ్డ మన దుద్దిళ్ల శ్రీధర్ బాబు. దేశంలో ఎన్నో విద్యాసంస్థలకు, ప్రాజెక్టులకు, పారిశ్రామిక ప్రగతికి, వైజ్ఞానిక ప్రగతికి, సుస్థిరతకు, సాధికారికతకు ప్రతీక అయిన జవహర్ లాల్ నెహ్రూ అంతటి మహానీయున్నే ఎన్నెన్నో మాటలంటున్న కాలమిది, మన బంగారం గురించి తక్కువగా అంచనా వేసేవాళ్లుండటంలో ఆశ్చర్యం లేదు.
ఆయన ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ, ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవాద విద్యలు అభ్యసించారు. అడ్వకేట్‌గా ప్రజల హక్కుల కోసం పోరాడాలని, సేవ చేయాలని ఉన్నత లక్ష్యంతో దేశ రాజధానిలో సాధన (ప్రాక్టీసు) కూడా ప్రారంభించారు. అనుకోని పరి స్థితులు ఆయనను రాజకీయాల్లోకి లాక్కొచ్చాయి. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. పెద్ద బాధ్యత. అయి నా ఎక్కడా తడబాటు లేకుండా తండ్రి దుద్ది ళ్ల శ్రీపాదరావు నెలకొల్పిన ఉత్కృష్ట ప్రమాణాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఆయనే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.
ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు రాష్ట్ర కేబినెట్ మంత్రి, ఇతర హోదాలు, పదవులు శ్రీధర్‌బాబును వెతుక్కుంటూ వచ్చాయి. ఎక్కడా మిడిసిపాటు కనిపించదు. సమస్యల పరిష్కారం కోసం ఎవరు కలిసినా చిరునవ్వుతో పలకరిస్తారు, ఆదరిస్తారు. వారి ఇబ్బందులను తన బాధలుగా భావిస్తారు, భరోసా ఇస్తారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కరు ణ, దయ, వినమ్రత, నిలువెత్తు సంస్కారాలకు ఆయన ప్రతిరూపం.
ఈమధ్య కాలంలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని ప్రాంతానికి అందుబాటులో ఉండ టం లేదంటూ కొన్ని గొంతుకలు అదే పని గా మొత్తుకుంటున్నాయి. బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోవడానికి, బాధ్యతల భారంతో సమయాన్ని తగ్గించడానికి తేడా లేదా? మన ఓటుతో ఎమ్మెల్యేగా ఎన్నికైన మన బిడ్డ ఇవాళ రాష్ట్రానికే దశ, దిశను నిర్దేశించడం మనకు గర్వకారణం కాదా? మనం కోరుకోవాల్సింది వారు అందుబాటులో ఉండటాన్ని కాదు, మన ప్రాంతం పట్ల వారి నిబద్ధతను. చెట్టంత ఎదిగిన కొడుకు ఇంకా తన కొంగు పట్టుకుని తిరగాలని ఏ తల్లీ కోరుకోదు. మరి కొండంత ఎదిగిన మన శ్రీధర్ బాబు ఇంకా మన చుట్టే తిరగాలని మనం ఆశిద్దామా? విమర్శించే నోళ్లకు సమాదానమివ్వడం మన భాద్యత కాదా?
శ్రీపాద సాగర్ (ఎల్లంపల్లి) కావచ్చు, చిన్న కాళేశ్వరం, గుండారం చెరువుకు 2 టీఎంసీల నీరు మళ్లింపు కావచ్చు మహాదేవపూర్, అడవి ముత్తారం రింగు రోడ్డు కావ చ్చు, జేఎన్‌టీయూ లాంటి కళాశాలలు కావచ్చు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, మైనారిటీ కళాశాలలు, సంగీత కళా శాల, గురుకులాలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ భవనాలు, పాలకేంద్రాలు, రైతు బజార్లు, అంబరాన్ని అంటేలా పుష్కర సంబరాలు, వేల ఎకరాల భూమి పట్టాలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, పారిశ్రామిక కారిడార్‌లు కావచ్చు,
గ్రామ గ్రామానికి రోడ్డు సౌకర్యాలు, నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణా తరగతులు కావ చ్చు ఒకటా, రెండా అన్నీ కూడా ఆయన మస్తిష్కం నుంచి జాలువారిన ఆలోచనల ప్రతిరూపమే. ఆయన నాయకత్వంలో రూపుదిద్దుకుని సాక్షాత్కరించిన మహిళల ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నిరుపేద, మధ్యతరగతి మహిళలకు, విద్యార్థినులకు, చిరుమహిళా ఉద్యోగులు, వ్యాపారులకు చేస్తున్న మేలు, ఇస్తున్న దైర్యం మాటల్లో చెప్పలేనిది.
గత 40 ఏండ్ల లో ఒక్క మంథని నియోజకవర్గం ఫరిదిలోనే సుమారు 30 వేల పైచిలుకు ఎకరాల భూమిని నిరుపేదలకు పట్టాలు చేయించిన చరిత్ర దుద్దిళ్ల కుటుంబానిది. రికార్డు స్థాయి లో ఇందిరమ్మ ఇండ్లను కేటాయించిన నా యకత్వం ఆయనది.
నిరుపేద, మధ్యతరగతి ప్రజల అనా రోగ్యాలకు, శస్త్ర చికిత్సలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం అందించి ఆదుకున్నది మర్చిపోతామా? ఎందరో ఔత్సాహిక రాయకీయ కార్యకర్తల ను నాయకులుగా తీర్చిదిద్దింది, అవకాశాలు అందించిది ఆయన కాదా? ప్రతినిత్యం ఆ యన 18 గంటలకు తగ్గకుండా పనిచేస్తున్నారన్నది అక్షర సత్యం. దేవుని పూజకు తప్పిం చి ఆయన వ్యక్తిగత ఆనందాల కోసం సమ యం వెచ్చించిన సందర్భాలు రెండు సంవత్సరాల కాలంలో రెండూ, మూడు కన్నా ఎక్కువ లేవంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.
గల్లీ నుంచి ఢిల్లీ దాక మంథని పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తున్నాయంటే అది శ్రీ ధర్ బాబు ప్రతిభ వల్లనే అనేది వాస్తవం. ఆ యన నాయకత్వంలో రాష్ట్రానికి ఎన్నెన్ని ని ధులు వస్తున్నాయి, పారిశ్రామిక ప్రగతి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్రామీణ ఉపాధి రంగాలు ఎంతగా ఎదుగుతున్నాయి, ప్రభుత్వంలో, శాసనసభలో, పార్టీలో ఆయనెంత కీలకంగా వ్యవహరిస్తున్నారు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నెన్ని లక్షల కుటుంబాలకు ఆయన అండగా నిలుస్తున్నారన్న సత్యాన్ని మనం కాకపోతే మరెవరు గుర్తిస్తారు! రాజకీయ పబ్బం కోసం బట్టకాల్చి మీద వేసేవా ళ్లు వస్తూనే ఉంటారు, కులాల పేరుతో, ద్వే షాన్ని వెదజల్లే వారు ఉంటూనే ఉంటారు.
30 ఏండ్లుగా మన నాయకుణ్ణి చూస్తు న్నాం, అప్పుడు ఇప్పుడు ఆయనది ఒకటే పద్ధతి, అదే చిరునవ్వు, అదే పలకరింపు, అదే స్థితప్రజ్ఞత, అదే ప్రజా పక్షపాతం. రాష్ట్ర పరిపాలనలో భాగస్వామిగా ఆయన అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందువల్ల ఆయన రోజూ మన మధ్య ఉండటం సా ధ్యం కాదు. రాజభవనాలు లేని రాజు మన నాయకుడు, విలాసాలకు ఆమడ దూరంలో ఉండే అలుపెరగని నేత మన నాయకుడు.
నిలువెత్తు సంస్కారం మన నాయకుడి సొం తం. ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎవరు రెచ్చగొట్టినా మాట తూలని వ్యక్తిత్వం ఆయనది. నిన్నటిదాకా ఆయన మూడు లక్షల మంథని ప్రజల ఆశాజ్యోతి, ఇప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి. రాష్ట్రం నలుమూలల నుంచి జనం ఆయన కోసం వస్తుంటే, మనం మాత్రం మా గడప దగ్గరకు రాలేదనే అనవసరపు ఆందోళన కొని తెచ్చుకుంటున్నాం.
ఆయన ఫిల్మ్ స్టార్ కాదు, 30 సంవత్సరాల నుంచి మంథనిలోని ప్రతి గల్లీలో తిరు గుతున్న అతి సామాన్యుడు. అయినా కూడా ఆయనతో ఫొటో దిగడానికి, ఆయనతో చేయి కలపడానికి ఈ రోజు కూడా మంథని జనం తపించిపోతారు, అదీ మంథని ప్రజలతో ఆయనకున్న అనుబంధం, అదీ వారి హృదయాలలో ఆయనకున్న స్థానం. దళితుల బాధలు పంచుకునే నాయకుడు,
బడుగుల బాధలు మోసే పెద్ద కొడుకు, ఆడ బిడ్డలను ఆప్యాయంగా పలుకరించే అన్న. యువతకు ఆయన ఆదర్శం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న ఆర్యోక్తిని అక్షరాలా పా టించే సహనశీలి. అంతెందుకు శ్రీధర్ బాబు మావోడు అని చెప్పుకోవడంలోనే ఏదో తెలియని గర్వం మన ముఖాల్లో తొణికిసలాడు తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన మంథని సూపర్ స్టార్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
అసెంబ్లీలో, అంతర్జాతీయ వేదికల మీద అంతటా చక్రం తిప్పుతున్న ధన్వాడ ముద్దుబిడ్డ, మంథని పులిబిడ్డ మన దుద్దిళ్ల శ్రీధర్ బాబు. దేశంలో ఎన్నో విద్యాసంస్థలకు, ప్రాజెక్టులకు, పారిశ్రామిక ప్రగతికి, వైజ్ఞానిక ప్రగతికి, సుస్థిరతకు, సాధికారికతకు ప్రతీక అయిన జవహర్ లాల్ నెహ్రూ అంతటి మహానీయున్నే ఎన్నెన్నో మాటలంటున్న కాలమిది, మన బంగారం గురించి తక్కువగా అంచనా వేసేవాళ్లుండటంలో ఆశ్చర్యం లేదు.
అంబేద్కర్ లాంటి దార్శనికున్ని ఓడించిన సమాజాల నుంచి మనం నేర్చుకో వాల్సింది, కంచు మోగినట్టు కనకంబు మోగదు, ఆరకుండ తొణికిసలాడినట్టు నిండుకుండ ఎగిరిపడదు. మన కులాన్ని పంచుకునేవాడు కాదు పెద్దకొడుకులా మన అవసరాన్ని తీర్చేవాడు కావాలి. ఎంగిలి మెతుకులు విదిల్చేవాడు కాదు, నిండు మనసు పంచేవాడు కావాలి. మన బిడ్డల బారసాలకు రాలేదని బాధపడటం కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజధానిలో అహర్నిశలు ప్రణాళికలు రచిస్తున్నారని గర్వపడదాం. మన మంథని, మన శ్రీధర్ బాబు, మన గౌరవం ఇదే మన నినాదం.
వ్యాసకర్త: న్యాయవాది






