26 June, 2026 | 6:41 PM

Breaking News

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •  

చూస్తున్నా..

20-04-2026 12:00 AM

ఉదయాన్నే నిద్రలేచి 

వెలుగుకోసం చూస్తున్నా

ఉషోదయపు కిరణంబుల 

వ్యాప్తికోసం చూస్తున్నా 

నిశీధిలో తట్టినట్టి తలంపులను తలచితలచి

నవ్వులైన కొత్తదనపు 

రంగుకోసం చూస్తున్నా 

గాలిలోన తేలియాడు సువాసనల 

గీతాల్లో గుండెల్లో మోగునట్టి 

స్వరంకోసం చూస్తున్నా 

మబ్బు వెనుకనున్న నీలివర్ణ ఆకాశంలో

మనసులను తాకేటట్టి 

క్షణంకోసం చూస్తున్నా 

పూలచెట్ల పొదలలోన 

పరిమళాల పరవశాల 

ప్రేమలోన పలకరించే 

స్పర్శకోసం చూస్తున్నా 

నిశ్శబ్దపు లోకంలో నడుస్తున్న 

అడుగుల్లో నిజంబుగా 

నిలిచిపోవు 

తోడుకోసం చూస్తున్నా

‘రాజేంద్రుని’ హృదయంలో 

కలలకడలి తీరంలో

కవితలుగా వికసించే 

భావంకోసం చూస్తున్నా