20-01-2026 12:30:38 AM
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
భూత్పూర్/ దేవరకద్ర జనవరి 19: మహిళలకు అండగా ప్రజాపలం ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు, రూ 16 లక్షల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కును మహిళా సంఘాలకు ఎమ్మెల్యే అందజేశారు. మహిళలు ఆర్థికంగా పెరిగినప్పుడే ఆ కుటుంబాలు మరింత బలంగా ఉంటాయని తెలియజేశారు.
ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం తో పాటు దేశం కూడా ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు దేవరకద్ర పట్టణంకు చెందిన బోయ శివశంకర్ నిమ్స్ ఆస్పత్రిలో గుండె సంబంధిత చికిత్స పొందుతున్నారు, అతని వైద్యం నిమిత్తం హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా రూ 3 లక్షల ఎల్‌ఓసి చెక్ ను అందజేసిన ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులుఉన్నారు.