calender_icon.png 20 January, 2026 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం

20-01-2026 12:29:57 AM

శామీర్‌పేట్ , జనవరి 19(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డిలతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో అధునాతన సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలన్నారు.అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు వజ్రెష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసర మైపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి  తహసిల్దార్ మహ్మద్ గులాం ఇద్రిస్, మున్సిపాలిటీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్, మాజీ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, హరి వర్ధన్ రెడ్డి , ఆర్టిఏ మెంబర్ భీమిలి జైపాల్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మాజీ సర్పంచ్ జాం రవి, మాజీ ఎంపిటిసి నాగరాజు, ప్రజా ప్రతినిధులు , అధికారులు నాయకులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.