calender_icon.png 5 May, 2025 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుండగులను కఠినంగా శిక్షించాలి

05-05-2025 01:30:58 AM

చేర్యాల, మే 4 : ఇటీవల మతిస్థిమితం లేని దళిత యువకుని పై దాడి చేసిన మతోన్మాద దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చేర్యాల పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించాయి. స్థానిక గాంధీ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని తీశాయి. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ బిజెపి మతోన్మాదులు ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్ దళ్ తదితరుల పేర్లు తో దళితులను చిన్నచూపు చూస్తూ, వారిని గుడిలోకి రానివ్వకుండా దూషిస్తున్నారన్నారు.

వేచరేణి లోని ఏళ్లదాస్ నగర్ కు చెందిన అజయ్ పై ఈ ప్రాంత ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్దళ్ కార్యకర్తలు ఉన్మాదులుగా మారి, కట్టేసి కర్రలతో కుట్టడం, నగ్నంగా ఊరేగింపు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ సంఘటనను ప్రగతిశీల వాదులు, ప్రజా సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలనున్నారు.

దోషులపై కఠిన తరమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసి, జైలుకు పంపి శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కిలి బాలకిషన్, మహాలమానాడు రాష్ట్ర నాయకులు బుట్టి సత్యనారాయణ కెవిపిఎస్  ఎమ్మార్పీఎస్ మాలమాడు నాయ కు లు అమ్ములు బాల నరసయ్య, దాసరి ప్ర శాంత్, తాడూరు మల్లేశం, తాడూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.