calender_icon.png 5 May, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కిటకిటలాడిన మల్లన్న ఆలయం

05-05-2025 01:34:03 AM

చేర్యాల, మే 4 : విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతోపాటు, ఆదివారం కూడా తోడవడంతో కొమురవెల్లి మల్లికార్జు న స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తజన సందర్భంగా మారాయి. స్వామివారి దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. భక్తుల రద్దీకి తగ్గట్లు ఆలయ వర్గాలు ఏర్పా ట్లు చేశారు. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని, బోనాలు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

గుట్ట పైనున్న ఎల్లమ్మ త ల్లిని దర్శించుకుని మొక్కులు అప్పజెప్పారు. మల్లన్న దర్శించుకున్న బీసీసీఐ క్యూరేటర్  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని బీసీసీఐ క్యూరేటర్ వైఎల్ చంద్రశేఖర్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

స్వామివారి కృపతో టీమిండి యా మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు రావాలని ఆకాక్షించారు. ఆయ న వెంట సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కలకుంట్ల మల్లికార్జున్ ఉన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.